తిరుపతి: శ్రీవారి ఆలయం మూతతో బోసిపోయిన అలిపిరి

4చూసినవారు
తిరుమలలో చంద్రగ్రహణం ప్రభావం స్పష్టంగా కనిపించింది. గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు మూసివేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం, గ్రహణానికి ఆరు గంటల ముందే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, రాత్రి 8:30 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. దర్శన సమయాల్లో మార్పులను గమనించాలని టీటీడీ అధికారులు సూచించారు. భక్తులతో ఎప్పుడూ రద్దీగా ఉండే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం కూడా గ్రహణం కారణంగా ఖాళీగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్