తిరుపతి: అలిపిరిలో ఉద్రిక్తత.. వైసీపీ ధర్నాకు అడ్డుకట్ట

0చూసినవారు
తిరుపతి అలిపిరి–జూపార్క్ బైపాస్ రోడ్డులో వారం క్రితం తొలగించిన చిరు వ్యాపారుల దుకాణాలను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే, తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్-30 అమలులో ఉండటంతో సభలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు అరకు టీ అంగడి ప్రాంతానికి భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, నిరసనకారులను అడ్డుకునే చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్