తిరుపతి: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన కలచివేసింది: భూమన

3చూసినవారు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పదేపదే జరగడం దురదృష్టకరమని, తిరుపతి, సింహాచలం ఘటనల తర్వాత కూడా కాశీబుగ్గలో నిర్లక్ష్యం పునరావృతమైందని ఆయన అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా, కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్