ఈ నెల 9న జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆదివారం కోరారు. ఈ సందర్భంగా వారు తిరుపతి నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కరపత్రాలను పంపిణీ చేశారు. సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర సమితి అధ్యక్షులు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.