రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ సర్వే నంబర్ 30లోని ప్రభుత్వ భూమిని పేదలకు కేటాయించేంతవరకు పోరాటం ఆగదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రాధాకృష్ణ హెచ్చరించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న దీక్షలో పాల్గొన్న ఆయన, ఎన్నికల్లో ఇచ్చిన ఇంటి స్థలాల హామీని ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పేదలకు భూములు ఇవ్వకపోతే సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.