తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కర్ణాటకలోని హుబ్లీకి చెందిన సునీల్ కుమార్ కుటుంబం పీఏసీ-3 సమీపంలో తమ బ్యాగును మరిచిపోయింది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జి. వి. రావు ఆ బ్యాగును గుర్తించి, పరిశీలించగా అందులో సుమారు 30 గ్రాముల బంగారు తాళిబొట్టు, సుమారు రూ. 4.5 లక్షల విలువైన వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ బ్యాగును సునీల్ కుమార్ కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. తమ విలువైన వస్తువులను తిరిగి అందించిన ట్రాఫిక్ పోలీసులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.