తిరుపతిలోని శ్రీనివాసం సముదాయం వెలుపల ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆటోలు, జీపులు, ప్రైవేట్ బస్సులు రోడ్డుపైనే నిలపడం, టిఫిన్ సెంటర్లు, వ్యాపారులు ఆక్రమణలు చేయడం వల్ల వాహనాల రాకపోకలకు, పాదచారుల నడకకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ట్రాఫిక్ స్తంభించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ట్రాఫిక్ నియంత్రణ, ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.