తిరుపతిలోని కొరమేనుగుంట జి. దేముడు కాలనీలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద గిరిజనులు మూడో రోజు నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. పేదల ఇళ్లకు మీటర్లు ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని సీపీఐ నేతలు ఏ. రామానాయుడు, పి. మురళి విమర్శించారు. గిరిజన గృహాలకు విద్యుత్ మీటర్లు మంజూరు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.