తిరుపతి: టీటీడీకి రూ. 7. 50 లక్షల విలువైన ఔషధాల విరాళం

1చూసినవారు
తిరుపతి: టీటీడీకి రూ. 7. 50 లక్షల విలువైన ఔషధాల విరాళం
హైదరాబాద్‌కు చెందిన ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి రూ. 7.50 లక్షల విలువైన ఔషధాలను విరాళంగా అందించింది. సంస్థ డైరెక్టర్ తలశిల వేంకటేశ్వరరావు తరఫున, టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శుక్రవారం తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీ. ఆర్. నాయుడుకు ఈ విరాళాన్ని అందజేశారు. ఈ ఔషధాలు భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఉపయోగపడతాయని టీటీడీ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్