తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు

75చూసినవారు
తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు
తిరుమలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరితో శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలోని సీఆర్వో కార్యాలయాన్ని ఆధునీకరించేందుకు చేపట్టిన ప్రణాళికలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. భవిష్యత్తులో యాత్రికుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా సౌకర్యాలతో సీఆర్వోను ఆధునీకరించేందుకు ఉన్న అవకాశాలను అధికారులతో ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్