Feb 12, 2026, 03:02 IST/
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె (వీడియో)
Feb 12, 2026, 03:02 IST
కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రకటించాయి. తెలంగాణ, ఆంధ్రాతో సహా అన్ని రాష్ట్రాల్లోని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఈ సమ్మెకు మద్దతు తెలిపాయి. ఈ కొత్త లేబర్ కోడ్ల వల్ల ESI, PF, గ్రాట్యుటీ, పింఛన్ వంటి ప్రయోజనాలకు కార్మికులు దూరమవుతారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత 29 చట్టాలను కొనసాగించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.