Mar 17, 2026, 05:03 IST/
స్నేహితుడు వీడియో తీస్తుండగా.. ఛాతిలో కాల్చుకున్న యువకుడు
Mar 17, 2026, 05:03 IST
ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ లో సోమవారం, మార్చి 17న, పవన్ అనే యువకుడు తన స్నేహితుడు వీడియో రికార్డ్ చేస్తుండగా, గన్తో తన ఛాతిలో కాల్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే పిస్తోల్ కి లైసెన్స్ ఉందని, అది వీడియో తీస్తున్న వ్యక్తిదే అని సమాచారం. కాల్చుకున్న యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.