Jan 17, 2026, 16:01 IST/
రేవంత్ ఎల్లకాలం సీఎం సీట్లో ఉండరు: KTR
Jan 17, 2026, 16:01 IST
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అధికార శాశ్వతం కాదని, ఇప్పుడున్న పదవిలో ఎల్లకాలం రేవంత్రెడ్డి కొనసాగరని గుర్తుంచుకోవాలని అన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపివేసే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్ చేశారు. శాంతి ర్యాలీని భగ్నం చేశామని చెప్పి రేవంత్, ఆయన ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందినా.. అది తాత్కాలికమేనని, మరోసారి కోర్టుకు వెళ్లి ర్యాలీని నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు.