
యుటిఎఫ్ రాపూరు శాఖ మహాసభ: నూతన కార్యవర్గం ఏకగ్రీవం
స్థానిక రాపూరు MPR యు.టీ.ఎఫ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాపూరు మండల శాఖ ఆధ్వర్యంలో మండల మహాసభ, నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు ఎన్.రమణయ్య ప్రభుత్వం ఆర్ధిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గౌరవాధ్యక్షులు పి.హరిప్రసాద్ రెడ్డి నూతన ఉపాధ్యాయులకు యు.టీ.ఎఫ్ భావజాలం, సంఘ లక్ష్యాలను తెలుసుకుని ఉద్యమ స్పూర్తిని పొందాలని సూచించారు. ఈ ఎన్నికల్లో గౌరవాధ్యక్షులుగా పి.హరిప్రసాద్ రెడ్డి, అధ్యక్షుడిగా కుంచం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా ఎ.శివసాయి, కోశాధికారిగా కె.వి.బి.ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


































