వెంకటగిరి IIHTలో అడ్మిషన్ల ప్రారంభం

3చూసినవారు
వెంకటగిరి IIHTలో అడ్మిషన్ల ప్రారంభం
వెంకటగిరిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్ ప్రభాకర్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 2500 స్టైఫండ్ లభిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కేంద్ర జౌళిశాఖలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది, అలాగే నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరే వీలుంటుంది.

సంబంధిత పోస్ట్