నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని అరుంధతి వాడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పచ్చిగళ్ళ రత్నయ్య, ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీని 'పింఛన్ల పండుగ'గా అభివర్ణించారు. గత 17 నెలల్లో సామాజిక పింఛన్లకే రూ.50,763 కోట్లు ఖర్చు చేశారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు, మంచానికి పరిమితమైన వికలాంగులకు రూ.15వేలు అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందించి, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ పంపిణీ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.