కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కలువాయి బస్టాండ్ లో ఆటో కార్మికులు నిరసన తెలిపారు. తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు, సేవ్ కలువాయి అంటూ నినాదాలు చేశారు. ఈ విలీనం వలన మండల ప్రజలు వాహనాల ఎఫ్.సి., రిజిస్ట్రేషన్, లైసెన్స్ ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, రెవెన్యూ, ఇరిగేషన్, రవాణా పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.