రాపూరు మండలంలో మొంధా తుఫాన్ కారణంగా నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు. మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు నిమ్మ చెట్లు వేళ్ళతో సహా పైకి లేచి, పూత, పిందెలు రాలిపోయాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. ఎన్నో ఏళ్ల సాగు నాశనమవడంతో రైతులు ఆగమ్యగోచరంగా మారారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.