స్వదేశీ వస్తువుల వాడకంతోనే దేశాభివృద్ధి: కోలా ఆనంద్

4చూసినవారు
రాపూరు పట్టణంలో జరిగిన ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ, ఇంటింటా స్వదేశీ నినాదంతో భారతదేశ అభివృద్ధికి స్వదేశీ వస్తువుల వాడకం తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి గ్రామానికి విస్తరించాలని ఆయన సూచించారు. వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షులు ఎస్ఎస్ నాయుడు మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్ వలన దేశం ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు, స్థానిక ఉత్పత్తిదారులు లబ్ధి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్