వెంకటగిరిని శ్రీకాళహస్తి డివిజన్‌లో కలపడం సరికాదని, వెంకటగిరిని కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం వెంకటగిరి పట్టణంలో మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వెంకటగిరి డివిజన్ ఏర్పాటు అంశంపై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టి సారించాలని ఆయన కోరారు.