జనవరి 2వ తేదీ సాయంత్రం తిరుపతిలోని ఎర్ర వారి పాలెం మండలం, ఎర్ర వారి పాలెం నందు గల శ్రీ రామాలయ దేవాలయములో ఓం శక్తి మాల ధారణ శక్తులు, అంతా కలిసి ఓం శక్తి మేరవన గరిగ మేరవణ కార్యక్రమం విశేష జనవాహిని సమక్షంలో జరిగింది. కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ గురు శక్తి 'దేవి' మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భోజన ప్రసాదాల తో భక్త జనంతో దేవాలయం కిటకిటలాడింది. ఈ కార్యక్రమం ఎర్ర వారి పాలెం, ఓం శక్తి గరిక పూజ మేరవన సందర్భంగా నిర్వహించబడింది.