తిరుపతి జిల్లా ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవ వంశీ శుక్రవారం వెంకటగిరిలోని ఏపీ మోడల్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న పథకాలు, విద్యా ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. టీచర్లు నిజాయితీగా విధులు నిర్వర్తించాలని కోరారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంవో సురేశ్, విద్యా శాఖాధికారి కొండయ్య నాయుడు పాల్గొన్నారు.