వెంకటగిరిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనేది తమ పార్టీ అజెండాలో భాగమని, జిల్లాల పునర్విభజన సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి డివిజన్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పోరాడాలని వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన పాలన, సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు.