బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడైన మారుతండ్రి సర్వేపల్లి అంజయ్యకు వెంకటగిరి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. బంగారుపేట అరుంధతిపాలేనికి చెందిన అంజయ్య, ఓ వివాహితతో కలిసి నివసిస్తూ, ఆమె 15 ఏళ్ల కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై 2021 జూలై 19న పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడు దోషిగా తేలడంతో, కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ. 40వేల జరిమానా విధించింది.