వెంకటగిరి: టిడ్కో ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు

1901చూసినవారు
వెంకటగిరి సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద ఆదివారం పోలీసులు ఆకస్మికంగా కార్డెన్ సెర్చ్‌ నిర్వహించారు. సీఐ ఏ. వి. రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో పత్రాలు లేని 16 బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్డెన్ సెర్చ్‌లు చేపడుతున్నట్లు సీఐ రమణ తెలిపారు.

ట్యాగ్స్ :