Feb 17, 2026, 16:02 IST/
ఆ 4 జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం: పొంగులేటి
Feb 17, 2026, 16:02 IST
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. HYD, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఈ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మార్చి చివరికి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ‘నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి నివాస ప్రాంతాల్లో 5-10 అంతస్తుల్లో గృహాల నిర్మాణానికి యోచిస్తున్నాం. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకూ అర్హులను ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.