Oct 23, 2025, 16:10 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
వాటర్ ట్యాంకు పనులను పరిశీలించిన కమిషనర్..
Oct 23, 2025, 16:10 IST
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి డబుల్ బెడ్ రూమ్ గృహాల వద్ద అమృత్ 2.0 కింద నిర్మిస్తున్న 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల నూతన వాటర్ ట్యాంక్ పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పరిశీలించారు. అనంతరం ఇంటి యజమానుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్, వర్క్ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, వాణి, టౌన్ ప్లానింగ్ సిబ్బంది శంకర్, భూమేష్ పాల్గొన్నారు.