
జగన్ సమీప బంధువు అర్జున్‌రెడ్డి అరెస్ట్?
AP: వైసీపీ అధ్యక్షుడు జగన్ సమీప బంధువు అర్జున్‌రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో అప్పటి ఆ వింగ్ ఇన్చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డితో కలిసి అర్జున్‌రెడ్డి యాక్టివ్‌గా పని చేశాడు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వైసీపీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటూ అర్జున్‌రెడ్డిపై గతేడాది నవంబరులో గుడివాడలో కేసు నమోదైంది.





















