
గ్రాట్యుటీకి ఏడాది సర్వీస్ చాలు: కేంద్రం కీలక మార్పులు
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలలో కీలక మార్పులు చేసింది. కొత్త లేబర్ కోడ్ల ప్రకారం, ఉద్యోగులు కేవలం ఒక సంవత్సరం సర్వీస్తోనే గ్రాట్యుటీకి అర్హులు అవుతారు. గతంలో ఐదేళ్ల సర్వీస్ తప్పనిసరి. ఈ సంస్కరణలు అనధికారిక కార్మికులు, గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లు, వలస కార్మికులు, మహిళా ఉద్యోగులతో సహా అందరికీ వర్తిస్తాయి. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు కూడా శాశ్వత ఉద్యోగులతో సమానంగా జీతాలు, సెలవులు, సామాజిక భద్రత వంటి ప్రయోజనాలు లభిస్తాయి.



































