
తిరుపతి
తిరుపతి ఆలయ ఘటనపై YCP ట్వీట్
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ ఘటనపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఒక తాగుబోతు ఆలయ గోపురంపైకి ఎక్కే వరకు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని, మద్యం తాగిన వ్యక్తి పవిత్ర ఆలయంలోకి ఎలా ప్రవేశించగలిగాడని వైసీపీ ప్రశ్నించింది. బీఆర్ నాయుడు నాయకత్వంలోని టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ అసమర్థతకు ఇది నిదర్శనమని, ఆలయాలను గాలికొదిలేసి చంద్రబాబు విమానాల్లో షికార్లు చేస్తున్నారని వైసీపీ విమర్శించింది.



































