
చైనా స్పై రోబోట్ భారత్ సరిహద్దులో కలకలం
భారత్-చైనా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలో చైనాకు చెందిన ఒక 'స్పై రోబోట్'ను భారత దళాలు గుర్తించాయని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవిష్యత్ యుద్ధాలు కేవలం మానవుల మధ్య కాకుండా, రోబోల దండుతో జరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. కృత్రిమ మేధ (ఏఐ), డ్రోన్లు, ఆటోనమస్ వెహికల్స్ను సైనిక వ్యూహాల్లో ఉపయోగిస్తున్న ప్రస్తుత తరుణంలో, చైనా సరిహద్దు భద్రతలో భాగంగా ఈ రోబోను ఉపయోగిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు.




































