రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఫిబ్రవరి 2న, మూడేళ్ల అక్షు అనే బాలిక చాక్లెట్ అనుకొని పేలుడు పదార్థం తినడంతో తీవ్రంగా గాయపడింది. స్థానిక దుకాణంలో కొనుక్కున్న ఆ పదార్థాన్ని నోట్లో పెట్టుకోగానే అది పేలి బాలిక నోరు, దవడ చీలిపోయాయి. బాలిక అత్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, షాపు యజమాని గన్‌పౌడర్ నింపిన పదార్థాన్ని ఇచ్చాడని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది.