చాక్లెట్ చోరి చేసిందని కూతురిని చంపిన తండ్రి

740చూసినవారు
చాక్లెట్ చోరి చేసిందని కూతురిని చంపిన తండ్రి
యూపీలోని బులంద్‌షహర్‌ జిల్లా రతన్‌పూర్ గ్రామంలో చాక్లెట్లు దొంగతనం చేసిందనే నెపంతో పన్నెండేళ్ల బాలిక పూజను ఆమె తండ్రి పుష్పేంద్ర కర్రతో కొట్టి చంపాడు. మద్యం మత్తులో ఉన్న పుష్పేంద్ర, బాలిక దొంగతనం చేసిందని తెలిసి ఆగ్రహంతో దాడి చేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్యపై కూడా దాడి చేసి, బాలికను గదిలో బంధించి, తాళం వేసి తండ్రి పారిపోయాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్