క్రిస్మస్: స్కూళ్లకు 5 రోజులు సెలవులు!

86చూసినవారు
క్రిస్మస్: స్కూళ్లకు 5 రోజులు సెలవులు!
AP: ఈ ఏడాది చివరి నెల డిసెంబరులో విద్యార్థులు, తల్లిదండ్రులు క్రిస్మస్ సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారికంగా డిసెంబరు 25న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించగా.. డిసెంబర్ 24, 26 తేదీలలో ఐచ్చిక సెలవులు (ఆప్షనల్ హాలిడే) ఇచ్చింది. దీంతో విద్యార్థులకు వరసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ నెల 27 శనివారం కూడా సెలవు తీసుకుంటే, మరుసటి రోజు ఆదివారం కావడంతో మొత్తం 5 రోజులు సెలవులు రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్