దళిత యువకుడిపై సీఐ దాడి: వైసీపీ

80చూసినవారు
దళిత యువకుడిపై సీఐ దాడి: వైసీపీ
AP: ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న దళిత యువకుడు ప్రమోద్ కుమార్‌పై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యకు దిగినట్లు తెలుస్తోంది. తప్పుడు కేసులు పెట్టించి.. పోలీస్ స్టేషన్‌లో సీఐతో లాఠీలతో కొట్టించినట్లు వైసీపీ ఎక్స్‌లో పేర్కొంది. గులకరాళ్లపై అతడిని నడిపించి పైశాచిక ఆనందం పొందినట్లు వెల్లడించింది. ఇలాంటి పోలీసులను డిజిటల్ బుక్‌లోకి ఎక్కించి.. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్