AP: 70 ఏళ్ల వృద్ధురాలు మట్రా జాలమ్మపై చీరాల టౌన్ సీఐ శశికుమార్ అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. ఆదివారం ఆదినారాయణపురంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. సీఐ వృద్ధురాలిపై అరుస్తూ, ఆమె ఇంటి వంటగది తలుపును కాలితో తన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీనిపై జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు అందడంతో ఆయన విచారణకు ఆదేశించారు.