AP: విశాఖ సీఐఐ సమ్మిత్ సూపర్ హిట్ అయ్యిందని సీఎం చంద్రబాబు అన్నారు. సదస్సుకు అంచనాలకు మించి పారిశ్రామికవేత్తలు తరలివచ్చారన్నారు. 3 రోజుల్లో రూ.13,25,719 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దీని ద్వారా 16,13,188 ఉద్యోగాలు వస్తాయన్నారు. 12 రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. పెట్టుబడుల సదస్సు చారిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు.