త్వరలో సీఐఐ సమ్మిట్‌: లోకేశ్ (వీడియో)

9చూసినవారు
AP: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికే టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గత 16 నెలల్లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంస్థలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. వైజాగ్‌లో త్వరలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.