CII Summit: హైసెక్యూరిటీ జోన్‌లోకి విశాఖ!

5578చూసినవారు
CII Summit: హైసెక్యూరిటీ జోన్‌లోకి విశాఖ!
AP: సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ నేపథ్యంలో విశాఖపట్నం హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. పరిశ్రమల ప్రతినిధులు, విదేశీ అతిథులు భారీ సంఖ్యలో రానుండటంతో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం 2,200 మంది పోలీసు సిబ్బంది మోహరించారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిసరాలు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉన్నాయి. నిఘా కోసం 15 డ్రోన్లు, 155 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.