ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సీఐఐ సదస్సు తొలి రోజున 365 సంస్థలతో రూ.8,26,668 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమ్మిట్ ముందు రోజుతో కలిపి మొత్తం 400 ఎంఓయూలు, రూ.11,99,971 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు పేర్కొంది. ఈ ఒప్పందాల ద్వారా 13,32,445 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరోసారి నిరూపించిందని పేర్కొంది.