AP: హైకోర్టు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 119 పోస్టులకు గాను, 96 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, 23 ట్రాన్స్‌ఫర్ ద్వారా భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 1 నుండి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లా పూర్తి చేసిన వారు అర్హుల. జీతం రూ.77,840–రూ.1,36,520 వరకు ఉంటుంది. వయోపరిమితి 35 ఏళ్లు (రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు) ఉంటుంది. పూర్తి వివరాలకు https://aphc.gov.in/recruitments.php వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.