AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరంలో జరిగిన 'ఆటో డ్రైవర్ల సేవలో పథకం' కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రవాణా శాఖ అధికారులు ముద్రించిన కరపత్రాలు, మెగా చెక్‌లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడమే ఈ వివాదానికి కారణం అని తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే రెండు పార్టీల నాయకులు ఈ విషయంలో ఒకరిపై ఒకరు వాదనలకు దిగారు.