బద్వేలు టీడీపీలో వర్గ విభేదాలు (వీడియో)

5974చూసినవారు
AP: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి సవిత సమక్షంలోనే విభేదాలు బయటపడ్డాయి. ఇన్‌ఛార్జ్ పదవి కోసం రితీష్ రెడ్డి, సూర్యనారాయణరెడ్డి వర్గీయులు ఆందోళన చేశారు. సూర్యనారాయణరెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పజెప్పేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. మంత్రి సవిత ముందే ఆందోళన చేయడంతో ఆమె ఫైరయ్యారు. తాను రాయలసీమ బిడ్డనే అని, ఇలా చేస్తే చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్