AP: జనవరి నుంచి రాష్ట్రంలో వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినా.. అది రాష్ట్రమంతా వర్తింపజేయాలని సూచించారు. స్వచ్ఛాంధ్రను ఉద్యమంగా చేపట్టాలన్నారు. గిరిజన, వెెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. వెదురును సులభంగా సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.