తిరుపతి నగరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన చోట, మేఘాలు మహాదేవుని లింగరూపంలో దర్శనమిచ్చాయి. ఈ అపురూప దృశ్యాన్ని చూసిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయి, 'హరహర మహాదేవ్' అంటూ నినదించారు. ఇదిలా ఉండగా, నిరంతరాయంగా గోవింద నామస్మరణతో మారుమోగే తిరుపతిలో, శ్రీవారి పవిత్ర నామాన్ని తలపించేలా ఓ సీతాకోకచిలుక కూడా భక్తులను ఆకట్టుకుంది.