AP: మదనపల్లెలో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొంటారు. రూ.లక్ష కోట్లతో నిర్మించనున్న ఈ హార్టికల్చర్ హబ్ 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లలో ఉద్యానవన అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రభుత్వ వాటా రూ.40,352 కోట్లు కాగా, ప్రైవేట్ రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులు ఆశిస్తున్నారు.