మంత్రివర్గ సమావేశం అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారని, వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులదేనని సూచించారు. 93 శాతం రిజర్వాయర్లు నీటితో నిండటం విజన్ 2047లో కీలక పరిణామమని తెలిపారు. పూర్వోదయ పథకం ద్వారా రూ. 65 వేల కోట్లు ఉద్యాన, ఆక్వా రంగాలకు వచ్చే అవకాశం ఉందని, స్థానిక పండుగలను ప్రోత్సహించాలని, కడపలో జిందాల్ ఉక్కు పరిశ్రమ 2028 నాటికి పూర్తవుతుందని, కర్నూలులో ఈ నెల 16న ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేయాలని కోరారు.