ప్రియాంక మృతిపై సంతాపం ప్రకటించిన సీఎం చంద్రబాబు

28చూసినవారు
ప్రియాంక మృతిపై సంతాపం ప్రకటించిన సీఎం చంద్రబాబు
AP: రాజమండ్రిలో జరిగిన కారు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంపై సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. నిందితుల నిర్లక్ష్యం, మద్యం మత్తు కారణంగా భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారని, వారి నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్