డయేరియా కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు ఆరా

72చూసినవారు
డయేరియా కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు ఆరా
AP: శ్రీకాకుళం (D), సంతబొమ్మాళి (M), తాళ్లవలసలో డయేరియా కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మరణించిన వృద్ధుడికి కిడ్నీ సమస్య, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ కారణమని వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో బావి, చేతి పంపుల ద్వారా నీటి సరఫరా అవుతోందని, నీటిని పరీక్షించగా కలుషితం కాదని, సురక్షితమేనని తేలిందని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్తగా బావి నీటి సరఫరా నిలిపివేసి, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :