అరవిందబాబుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి!

287చూసినవారు
అరవిందబాబుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి!
AP: నరసారావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ప్రవర్తనపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అనుచరుడికి కాంట్రాక్టు ఉద్యోగంలో నియమించే విషయమై పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే రచ్చ చేయడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించేలా ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహరించారని భావిస్తూ, ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్